ఈ ఇయర్ మొదట్లో దేవ్ అనే సినిమాతో వచ్చి బొక్క బోర్లా పడ్డ తమిళ్ హీరో కార్తీ దీపావళి కి మాత్రం ఖైదీ అనే ఇంటెన్స్ యాక్షన్ మూవీ తో వచ్చి ఆడియన్స్ మనసు గెలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు మరోసారి….
దొంగ అంటూ రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ లభించింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సొంతం చేసుకుంది, పోటి లో రెండు క్రేజీ తెలుగు సినిమాలు ఉండటం.
ఆ ముందు వారం మరో మంచి సినిమా ఉండటం వాటికి తోడూ దబంగ్ 3 ఉండటం లాంటివి తెలుగు లో దొంగ సినిమా కి ఎదురుదెబ్బ కొట్టాయి. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ అందరి మైండ్ బ్లాంక్ చేసేలా ఉన్నాయి.
సినిమా మొదటి రోజు కేవలం 23 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది, కానీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఓవరాల్ బిజినెస్ మాత్రం ఏకంగా 3.5 కోట్లకు జరిగింది. అంటే సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 4 కోట్లు కలెక్ట్ చేయాలి.
మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా మిగిలిన రన్ లో 3.77 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, రెండో రోజు కూడా ఇప్పటి వరకు రిపోర్ట్స్ పెద్దగా ఎంకరేజింగ్ గా అయితే లేవనే చెప్పాలి. మరి సినిమా ఏలా నెట్టుకు వస్తుందో చూడాలి.