Home TRP రేటింగ్ అక్కడా డిసాస్టరే…ఇక్కడా డిసాస్టరే…1.6 కోట్ల రేటు…TRP వచ్చింది ఇది!

అక్కడా డిసాస్టరే…ఇక్కడా డిసాస్టరే…1.6 కోట్ల రేటు…TRP వచ్చింది ఇది!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరున్న హీరోల్లో కార్తీ కూడా ఒకరు, కెరీర్ మొదటి నుండి అక్కడ కన్నా ఇక్కడ భారీ హిట్స్ ని సొంతం చేసుకున్న కార్తీ మధ్యలో ఫాం కోల్పోయినా కానీ అప్పుడప్పుడు తనదైన సినిమాలతో మెప్పించాడు, లాస్ట్ ఇయర్ దీపావళి కి ఖైదీ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన కార్తీ తర్వాత క్రిస్టమస్ వీకెండ్ లో దొంగ సినిమా తో…

మరోసారి తన లక్ ని పరీక్షించుకోగా ఈ సారి మాత్రం రిజల్ట్ తేడా కొట్టింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడమే సైలెంట్ గా రిలీజ్ అవ్వగా టాక్ కూడా ఏమాత్రం పాజిటివ్ గా లేకపోవడం తో సినిమా భారీ ఫ్లాఫ్ గా నిలిచింది, సినిమా ను…

టోటల్ గా 3.5 కోట్లకు అమ్మగా 4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1.86 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని 1.64 కోట్ల లాస్ ని బిజినెస్ లో సాధించి డిసాస్టర్ రిజల్ట్ ని సాధించగా టెలివిజన్ లో సినిమా టెలికాస్ట్ అవ్వడానికి…

కొంచం టైం పట్టగా జీ తెలుగు వాళ్ళు సినిమాను 1.6 కోట్ల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారని న్యూస్ ఉండగా సినిమా ను రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడు TRP రేటింగ్ కూడా భారీ షాక్ నే ఇవ్వడం విచారకరం అనే చెప్పాలి.

కార్తీ జ్యోతిక నటించిన ఈ సినిమా కి తొలిసారి టెలికాస్ట్ అయినప్పుడు 3.44 TRP రేటింగ్ మాత్రమే దక్కింది, దాంతో సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అనిపించుకోవడమే కాకుండా ఇటు రేటు ప్రకారం టెలివిజన్ లో కూడా డిసాస్టర్ రిజల్ట్ నే సొంతమ్ చేసుకుంది, ఇక రిపీట్ టెలికాస్ట్ తో లేట్ గా సేఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here