అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ మేజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఓవర్సీస్ లో ఆల్ రెడీ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అవ్వగా నైజాం లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా హైదరాబాదులో అడ్వాన్స్ సేల్స్ ద్వారా 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా….
ఇప్పుడు రిలీజ్ రోజున మార్నింగ్ షోల నుండే జోరు చూపిస్తూ దూసుకు పోయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా కొనసాగుతున్నాయి. దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని అందుకోవడం….
పక్కగా కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కానీ షో షో కి ఇంప్రూవ్ మెంట్ ని చూపిస్తుంది. ఇక డే ఎండ్ అయ్యే వరకు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…