ఇలయ దళపతి విజయ్ విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లో భారీ లెవల్ లో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ సేల్స్ అన్నీ కూడా అడ్వాన్స్ టికెట్స్ రూపంలోనే అయిపోగా సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని ఇప్పుడు మొదటి రోజు సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాలిడ్ మార్జిన్ తో సొంతం చేసుకోబోతుంది..
సినిమా మొదటి రోజు ఇప్పుడు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉంది, ఇక అంతకుమించి కలెక్షన్స్ ని సాధిస్తే అది ఊచకోత అనే చెప్పాలి. ఇక తమిళనాడు మొదటి రోజు అక్కడ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న…
లెక్కల ప్రకారం సినిమా మొదటి రోజు 22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందట, ఇక కర్ణాటకలో లో 5 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సినిమా సొంతం చేసుకోవచ్చు అంటున్నారు, ఓవర్సీస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 నుండి 8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మొదటి రోజు కలెక్షన్స్ తో సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. మొత్తం మీద మొదటి రోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మినిమమ్ సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు, మరి అఫీషియల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ లెక్కలను మించుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు రిలీజ్ అయ్యాక అప్ డేట్ చేస్తాం…