బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ టైం లో సినిమాల రిలీజ్ కి హడావుడి మరో లెవల్ లో ఉంటుంది, దీపావళి పండగ టైం లో బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచిన సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ బిజినెస్ ను సొంతం చేసుకుని బరిలోకి దిగిన సినిమాలు రజినీ పెద్దన్న మరియు మారుతి మంచి రోజులొచ్చాయి సినిమాలు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ రోజుకి వచ్చే సరికి ఓపెనింగ్స్ విషయంలో…
పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా పెద్దగా జోరు అయితే చూపలేదు, మారుతి మంచి రోజులొచ్చాయి కొంచం బెటర్ ఆక్యుపెన్సీ తో ఓపెన్ అయినా హౌస్ ఫుల్ బోర్డులు చాలా కొన్ని చోట్లనే పడ్డాయి ఇప్పటి వరకు. ఇక సూపర్ స్టార్ రజినీ పెద్దన్న సినిమా…
తెలుగు లో హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఆక్యుపెన్సీ ప్రీవియస్ రజినీ మూవీస్ తో పోల్చితే తక్కువగా ఓపెన్ అవ్వడం విచారకరం, షో షోకి బుకింగ్స్ మెల్లి మెల్లిగా పెరుగుతున్నా కానీ పండగ అడ్వాంటేజ్ తో ఓపెనింగ్స్ ను ఇతర సినిమాలు సొంతం చేసుకునే రేంజ్ లో అయితే….
ఈ రెండు సినిమాలు ఓపెన్ అవ్వలేదు…. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు దీపావళి పూజా ఉంటుంది కాబట్టి అది కొంచం ఎఫ్ఫెక్ట్ అయ్యే అంశమే అయినా కానీ ఓవరాల్ గా డే ఎండ్ టైం కి ఈ సినిమాలు పుంజుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే మంచి రోజులొచ్చాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల రేంజ్ లోనే…
ఓపెనింగ్స్ ను అందుకునేలా ఉండగా మరో పక్క రజినీ పెద్దన్న సినిమా 1.6-1.8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందనిపిస్తుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమాలు సాధించే గ్రోత్ ని బట్టి కలెక్షన్స్ పరంగా ఈ సినిమాలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అన్నది చెప్పగలం… డే ఎండ్ టైం కి మరో రిపోర్ట్ ని అప్ డేట్ చేస్తాం…