బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న తెలుగు రాష్ట్రాల్లో దీపావళి హాలిడే రోజున మిగిలిన సినిమాల కన్నా కూడా భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేసి రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ కూడా మిగిలిన సినిమాల కన్నా ఎక్కువ చేయడంతో ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఫస్ట్ డే ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే టైం కి…
1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకోగా 2 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ కూడా ఉందనుకుంటే సినిమా ఫస్ట్ డే నే బాక్స్ ఆఫీస్ భారీ ఎదురుదెబ్బ కొట్టి డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది….
సినిమా ఎక్కడా అంచనాలను మించి గ్రోత్ ని ఏమి సొంతం చేసుకోలేదు, 1.46 కోట్ల వర్త్ షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మరో 14 లక్షల హైర్స్ గుంటూరు లో యాడ్ అవ్వడంతో అవి కలిపి 1.6 కోట్ల షేర్ మార్క్ ని తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు సొంతం చేసుకుంది….
దాంతో టోటల్ గా ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 53L
👉Ceeded: 24L
👉UA: 16L
👉East: 12L
👉West: 9L
👉Guntur: 25L(14L Hires)
👉Krishna: 11L
👉Nellore: 10L
AP-TG Total:- 1.60CR(2.45CR~ Gross)
ఇదీ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు అన్నీ…
రిలీజ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, అవి మరో ఆర్టికల్ లో డీటైల్ గా అప్ డేట్ చేస్తాం, మొత్తం మీద 12.5 కోట్ల బిజినెస్ కి 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 11.4 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… ఇక రెండో రోజు సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.