పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ బిగ్ మూవీస్, భీమ్లా నాయక్ మరియు పుష్పలతో పోల్చితే థియేటర్స్ కౌంట్ తక్కువే సొంతం చేసుకుంది, నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషనల్ అనిపించే విధంగా ఉండగా ఆంధ్రలో టికెట్ హైక్స్ లేట్ గా…
రావడంతో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ చేయగా మొత్తం మీద ఆన్ లైన్ బుకింగ్స్ రిలీజ్ రోజునే ఎక్కువగా కొనసాగగా ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ కూడా సాలిడ్ గానే జరిగాయి, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఎక్స్ లెంట్ బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆంధ్రలో కొంచం డ్రాప్స్ కనిపించాయి,
ఆఫ్ లైన్ లో ఎక్కువ టికెట్ సేల్స్ జరగగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా 27 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉండగా ఆంధ్రలో కొన్ని చోట్ల హైర్స్ యాడ్ అయితే…ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళబోతుంది…. కానీ థియేటర్స్ తక్కువ అవ్వడంతో ప్రీవియస్ బిగ్ మూవీస్ రేంజ్ లో షోలు పడలేదు కానీ టికెట్ హైక్స్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకొంచం బెటర్ అయ్యే అవకాశం ఉంది…..
ఇక హిందీలో చాలా స్లో గా ఓపెన్ అయిన సినిమా కొన్ని చోట్లా బెటర్ గానే ఉన్నప్పటికీ అక్కడ 5-6 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ రేంజ్ లో కలెక్షన్స్ సాధించేలా ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే ఇది సాధ్యం అని అంటున్నారు, ఒకవేళ అంచనాలు మించి పోయే రేంజ్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఉంటే ఈ లెక్క ఇంకా మించవచ్చు, ఇక కర్ణాటకలో సినిమా బాగానే ఓపెన్ అవ్వగా మిగిలిన చోట్ల మాత్రం యావరేజ్ రేంజ్ లోనే ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పాలి…
ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ లెక్కలు మొదటి రోజు కలెక్షన్స్ తో కలిపి రాబోతుండగా అక్కడ మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేక పోయినా డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకోబోతుంది. మొత్తం మీద సినిమా జానర్ దృశ్యా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకోబోతున్నా కానీ ప్రభాస్ బాహుబలి అండ్ సాహో రేంజ్ తో పోల్చితే మాత్రం అంచనాలను అనుకున్న రేంజ్ లో అందుకోలేదు… ఇక అఫీషియల్ అన్ని ఏరియాల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…