యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెల అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని సినిమాల మీద కూడా గట్టిగానే ఉందని చెప్పాలి. ఈ మంత్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా…
ఇప్పుడు కార్తికేయ నటించిన రాజా విక్రమార్క ఓవరాల్ గా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ ఇంకాస్త జోరు ఎక్కువ చూపెట్టి ఉంటే బాగుండేది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 2 సినిమాల నుండి పోటి ని ఎదురుకోగా…
మొత్తం మీద 40-50 లక్షల రేంజ్ కలెక్షన్స్ ఫస్ట్ డే వస్తాయి అనుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 60 లక్షల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావించగా మొత్తం మీద సినిమా రోజు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాలలో సినిమా 62 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని సమచారం…
గ్రాస్ తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ కోటి రేంజ్ లో ఉంటుందని అంచనా అందులో నైజాంలో సినిమా 18 లక్షల దాకా షేర్ ని అందుకోగా సీడెడ్ లో 8 లక్షల షేర్ ని టోటల్ ఆంధ్రలో 36 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇందులో కొన్ని చోట్ల హైర్స్ కూడా ఉన్నాయని సమాచారం. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ అన్ని చోట్లా కలిపి మొదటి రోజు సినిమా 75 లక్షల దాకా…
షేర్ ని అందుకుందని సమాచారం… టోటల్ గ్రాస్ 1.25 కోట్ల దాకా ఉంటుందని చెప్పొచ్చు. సినిమాను మొత్తం మీద 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దాంతో సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 3.75 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాలి, మిగిలిన వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బాగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది..