కాంచన సిరీస్ అంత కాకున్నా టాలీవుడ్ ఆడియన్స్ లో రాజుగారిగది సిరీస్ పై కూడా ఎంతో కొంత మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు, మొదటి పార్ట్ ఊహించని బ్లాక్ బస్టర్ అవ్వడం తో రెండో పార్ట్ భారీ స్టార్ కాస్ట్ తో వచ్చి దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా లాంగ్ రన్ లేక నిరాశ పరిచింది, ఇక ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో రూపొందిన రాజుగారిగది 3 రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…
యావరేజ్ గా 2 స్టార్ నుండి 2.5 రేంజ్ స్టార్ రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, రొటీన్ కథ తో తెరకెక్కిన సినిమా లో ప్రేక్షకుల ను అలరించే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నా పూర్తిగా సినిమా పరంగా చూసుకుంటే యావరేజ్ అనిపించే విధంగా ఉంటుంది సినిమా.
కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టైటిల్ కి ఉన్న బ్రాండ్ వలన టాక్ కి అతీతంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్లకి పైగా షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల కి పైగా షేర్ ని సాధించింది.
టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 46L
?Ceeded: 28L
?UA: 16L
?East: 9.51L
?West: 6.2L
?Guntur: 14L
?Krishna: 8.7L
?Nellore: 4L
AP-TG Day 1:- 1.32Cr
Ka & ROI: 0.15Cr
OS: 10L
Total: 1.57Cr(2.6Cr Gross) ఇదీ మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్..
సినిమా ను టోటల్ గా కొన్ని చోట్ల ఓన్ గా రిలీజ్ చేసినా టోటల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 5.2 కోట్ల రేంజ్ లో ఉంది, దాంతో బ్రేక్ ఈవెన్ కి 6 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమా వీకెండ్ సాలిడ్ గా ఉంటె చాలా మొత్తాన్ని వెనక్కి తెచ్చుకునే అవకాశం అయితే గట్టిగా ఉందని చెప్పొచ్చు.