నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన సినిమా వి ది మూవీ… సుదీర్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ కరోనా వలన కుదరక తర్వాత డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది, తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన సినిమా అక్కడ కూడా….
అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది… సినిమా అన్ని పనులను పూర్తీ చేసుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద డీసెంట్ అనిపించే విధంగా…
థియేటర్స్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 110 థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. కానీ సినిమా టాక్ అండ్ అప్పటికే రిలీజ్ అయ్యి చాలా రోజులు అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారగా న్యూ ఇయర్ హాలిడే…
అవ్వడం తో మొత్తం మీద మొదటి రోజు మట్టుకు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది, నైజాంలో రెండున్నర లక్షలు, సీడెడ్ లో లక్షన్నర మరియు ఆంధ్రలో 3 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 7 లక్షల షేర్ ని సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఆల్ రెడీ డిజిటల్ లో అండ్ టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమాకి…
ఇది మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. పెర్సేంటేజ్ బేస్ మీద సినిమా రిలీజ్ అవ్వడంతో ఎలాంటి బిజినెస్ లేదు. ఎంతవరకు కలెక్ట్ చేస్తే అంత నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు పంచుకోబోతున్నారు. ఇక వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.