Home న్యూస్ 130 థియేటర్స్ లో రిలీజ్…ఫస్ట్ డే ఒరేయ్ బుజ్జిగా కలెక్షన్స్ ఇవే!

130 థియేటర్స్ లో రిలీజ్…ఫస్ట్ డే ఒరేయ్ బుజ్జిగా కలెక్షన్స్ ఇవే!

0

2020 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమాలలో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా ఒకటి. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న రాజ్ తరుణ్ ఈ సినిమా పై ఆశలు అంచనాలు గట్టిగానే పెట్టుకోగా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా తర్వాత మంచి డిజిటల్ రిలీజ్ ఆఫర్లు వచ్చినా నో చెప్పి తర్వాత తక్కువ రేటుకే డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది.

టాక్ రొటీన్ గానే వచ్చినప్పటికీ భారీ వ్యూస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అవ్వగా డీసెంట్ రేటింగ్ నే సొంతం చేసుకుంది, అన్ని పనులు పూర్తీ అయిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను కన్ఫాం చేసుకుని…

జనవరి 1 న రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ లెవల్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా సుమారు 130 వరకు థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవ్వగా మొదటి రోజు మంచి వసూళ్ళనే సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు సాధించిన షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 5L
👉Ceeded: 2L
👉UA: 1.8L
👉East: 1L
👉West: 0.4L
👉Guntur: 1L
👉Krishna: 0.7L
👉Nellore: 0.3L
AP-TG Total:- 12.2L
ఇవీ మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్… నైజాం లో సినిమా మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది, సీడెడ్ లో బెటర్ కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ హాలిడే ని సినిమా బాగానే ఎంజాయ్ చేసింది…

ఆల్ రెడీ డిజిటల్ రిలీజ్ ను దక్కించుకుని తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినా కానీ సినిమా కి మంచి వసూళ్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి, న్యూ ఇయర్ హాలిడే కూడా కలిసి రాగా ఇప్పుడు వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా కూడా బిజినెస్ లేకుండా పెర్సేంటేజ్ బేస్ మీద రిలీజ్ అయ్యిందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here