Home న్యూస్ “ఏడు చేపల కథ” ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని షాక్ ఇది!!

“ఏడు చేపల కథ” ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని షాక్ ఇది!!

0

     అడల్ట్ కామెడీ కాన్సెప్ట్ తో లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయిన సినిమా “ఏడు చేపల కథ”… జస్ట్ టీసర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుని ట్రేడ్ మొత్తానికి షాక్ ఇస్తూ మొదటి రోజే బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి సొంతం చేసుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి షో కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ యూత్ లో సినిమా పై ఉన్న క్రేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకుంది, 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే…

ఏకంగా 1.06 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.13 కోట్ల షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర షాకింగ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుని సంచలనం సృష్టించింది, సినిమా మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

?Nizam: 38L
?Ceeded: 21L
?UA: 13L
?East: 8L
?West: 6.5L
?Guntur: 7L
?Krishna: 7.4L
?Nellore: 5L
AP-TG Day 1:- 1.06Cr
Ka & ROI: 5L
OS: 2L
Total WW: 1.13CR(1.9cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు.

సినిమాను రెండు రాష్ట్రాలలో 1.4 కోట్లకు అమ్మగా వరల్డ్ వైడ్ గా 1.7 కోట్లకు అమ్మారు, దాంతో 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే సగానికి పైగా రికవరీ చేయగా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్ తేడా గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం భారీ గా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here