ఏ సినిమా యూనిట్ అయినా తమ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనే చెప్పుకుంటారు కానీ తక్కువ కలెక్షన్స్ వచ్చాయి అని ఎవ్వరూ చెప్పుకోరు, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే… కానీ రీసెంట్ టైం లో తెలుగు లో అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయంలో మాత్రం వీకెండ్ లో ట్రేడ్ వర్గాలు వేసిన కలెక్షన్స్ కన్నా కూడా మేకర్స్ తక్కువ గ్రాస్ కలెక్షన్స్ ని వేసారు…
దాంతో ఫ్యాన్స్ టీం ని ట్రోల్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకున్నారు, ఇలాంటివి బాలీవుడ్ లో మాత్రం ఎప్పుడూ జరగవు అనే చెప్పాలి, కానీ రీసెంట్ గా అక్కడ కూడా ఇదే మాదిరి ఇంసిడెంట్ జరిగింది ఇప్పుడు… రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా….
అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ లు స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన సూర్యవంశీ సినిమా ఏడాదిన్నర తర్వాత బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోసిన సినిమాగా నిలవగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా దుమ్ము లేపే వసూళ్ళతో వీకెండ్ ని అద్బుతంగా ముగించి దుమ్ము దులిపేసింది… కాగా మూడు రోజుల వీకెండ్ లో…
ఇండియాలో 96 కోట్ల గ్రాస్ ను ఓవర్సీస్ లో 19 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ గా 115 కోట్ల గ్రాస్ ను అందుకుంటే మేకర్స్ మాత్రం మూడు రోజుల్లో 101.66 కోట్ల గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుంది అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు… దాంతో ట్రేడ్ వర్గాలు అందరూ 115 నుండి 118 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వేసి ఇంత వచ్చాయి అంటూ…
చెబుతూ ఉంటే మేకర్స్ కలెక్షన్స్ తగ్గించి చెబుతూ ఉండటంతో ఆ మాత్రం లెక్కలు వేసుకోలేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువ శాతం ట్రేడ్ వర్గాలు వేసిన కలెక్షన్స్ కన్నా మేకర్స్ కలెక్షన్స్ 10-15% ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ 10-15% తక్కువ కలెక్షన్స్ మేకర్స్ కన్ఫాం చేయడం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది అని చెప్పాలి. సినిమా మాత్రం వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసి దుమ్ము లేపుతుంది.