బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా కి పోటి ఇచ్చే సినిమా కూడా ఏమి లేకున్నా కానీ వీకెండ్ లో దంచి కొట్టిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అయింది.
అన్ని ఏరియాలకు మించి నైజాం ఏరియాలో సినిమా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం ఓవరాల్ కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 40% కి పైగానే డ్రాప్స్ ను….
సొంతం చేసుకుంది… 45-50 లక్షల రేంజ్ కలెక్షన్స్ రావొచ్చు అనుకోగా సినిమా 51 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో 7 వ రోజు సొంతం చేసుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారానికి గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఏరియాల వారిగా ఒకసారి గమనిస్తే…
👉Nizam: 7.62Cr
👉Ceeded: 5.93Cr
👉UA: 4.37Cr
👉East: 3.53Cr
👉West: 2.54Cr
👉Guntur: 3.03Cr
👉Krishna: 1.94Cr
👉Nellore: 1.52Cr
AP-TG Total:- 30.48CR(49.30Cr~ Gross)
👉Ka+ROI: 1.62Cr
👉OS – 1.35Cr
Total WW: 33.45CR(56CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను మొత్తం మీద…
38.15 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 39 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక సినిమా మొదటి వారం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 5.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సినిమా రెండో వీక్ లో మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.