బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రంజాన్ కానుకగా రీసెంట్ గా సొంతం చేసుకోగా సినిమా కి టాక్ కంప్లీట్ నెగటివ్ గా వచ్చినప్పటికీ కూడా వ్యూవర్ షిప్ మాత్రం ఆల్ టైం రికార్డ్ లెవల్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది రాధే సినిమా. సినిమా మొదటి రోజు ఏకంగా 4.2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…
మొదటి వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 7.6 మిలియన్ వరకు వ్యూస్ ని జీ ప్లెక్స్ యాప్ లో అలాగే DTH ద్వారా కలిపి సొంతం చేసుకుందని సమాచారం. ఇక సినిమా మొత్తం మీద మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సినిమా బాగానే హోల్డ్ చేసిందని అంటున్నారు.
అఫీషియల్ గా పోస్టర్స్ ని ఇంకా రిలీజ్ చేయలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమా మొత్తం మీద మొదటి వారం పే పెర్ వ్యూ పద్దతిలో జీ ప్లెక్స్ యాప్ లో, DTH లో కలిపి 8.68 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు.
అంటే మొత్తం మీద సినిమా ను మొదటి వారంలో వివిధ ప్లాట్ ఫామ్స్ లో కలిపి 86 లక్షల మంది 249 టికెట్ రేటు తో అలాగే జీ 5 యాప్ 1 ఏడాది సబ్ స్క్రిప్షన్ 499 రేటు తో చూశారని సమాచారం. 249 రేటు తోనే 86 లక్షల వ్యూస్ ని లెక్కేస్తే…. 214 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు. 499 రేటు కూడా కన్సిడర్ చేస్తే…
సినిమా మొత్తం మీద మొదటి వారం లో 225 కోట్ల రేంజ్ గ్రాస్ ని ఇండియా లో సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో ఫస్ట్ వీక్ సినిమా 17 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది, అంటే సినిమా టోటల్ గా మొదటి వారం వరల్డ్ వైడ్ గా 242 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. సినిమా టాక్ కి ఇది ఊహకందని కలెక్షన్స్ అనే చెప్పొచ్చు.
Stupid calculations. How can you multiply total subscription amout of one year to a single movie?
Very foolish.