యూత్ స్టార్ నితిన్(Nithiin) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాతే నార్మల్ ఎంటర్ టైనర్ అనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను…
ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా ఓపెనింగ్స్ పై టాక్ అండ్ నితిన్ ప్రజెంట్ ఫామ్ ఇబ్బంది అయితే పడింది అనే చెప్పాలి. కొన్ని మాస్ సెంటర్స్ లో సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్నా కానీ చాలా సెంటర్స్ లో మాత్రం సినిమా బుకింగ్స్ బిలో పార్ అనిపించే విధంగానే ఉన్నాయి.
ఓవరాల్ గా సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చెప్పాలి అంటే మొదటి రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా 2.5 కోట్ల దాకా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది.
వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 3 కోట్ల నుండి 3.25 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది, అది కూడా ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.