వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా, అనుకున్న రేంజ్ లో హైప్ ను సొంతం చేసుకుని ఉంటే రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఓపెనింగ్స్ తో కుమ్మేయాల్సింది కానీ డిలే అవుతూ రావడం…రిలీజ్ అయిన తర్వాత టాక్…
మరీ అనుకున్న రేంజ్ లో లేక పోవడం లాంటివి ఇంపాక్ట్ చూపించడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజే ఓపెన్ అవ్వడం లాంటి అనేక కారణాలు ఇంపాక్ట్ చూపించినా కూడా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.
సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 50 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ రోజున టాక్ ఎలా ఉన్నప్పటికీ మంచి టికెట్ సేల్స్ తో రోజు మొత్తం జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే…
ఆ రేంజ్ లో ఇంపాక్ట్ కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతున్న సినిమా నైజాం లో దుమ్ము లేపుతుంది అనుకున్నా రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ లో బుకింగ్స్ 50% రేంజ్ కి అటూ ఇటూగానే ఉండగా సీడెడ్ లో పర్వాలేదు అనిపించేలానే ఉన్నాయి…
ఆంధ్రలో కొంచం బెటర్ గా జోరు చూపించిన సినిమా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 38-40కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 42కోట్ల దాకా వెళ్ళొచ్చు కానీ ఆఫ్ లైన్ లెక్కలు సూపర్ స్ట్రాంగ్ గా ఉండాల్సి ఉంటుంది….
ఇక హిందీ లో సినిమా మంచి బుకింగ్స్ నే సొంతం చేసుకోగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 7-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా అక్కడ మాస్ సెంటర్స్ లో జోరు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. కంప్లీట్ మాస్ సెంటర్స్ ను బట్టి హిందీలో సినిమా రాంపెజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎంతైనా ఉంది.
ఇక కర్ణాటక-తమిళ్ అండ్ కేరళ కలిపి ఓవరాల్ గా 4-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 1 మిలియన్ మార్క్ ని దాటిన సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపి ఓవర్సీస్ లో 9-10 కోట్ల షేర్ మార్క్ ని దాటే అవకాశం కనిపిస్తుంది.
దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి 60కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ అంచనాలను ఎంతవరకు మించి పోయి మాస్ ఊచకోత కోస్తాయా లేక ఇదే రేంజ్ లో వసూళ్లు వస్తాయో చూడాలి.