Home న్యూస్ 85 కోట్ల హీరో…గం గం గణేశ 1st డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!!

85 కోట్ల హీరో…గం గం గణేశ 1st డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!!

1

2023 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బేబి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ అయిన గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పోటిలో 3 సినిమాల మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా బేబి జోరుని కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారగా…

బేబి టోటల్ రన్ లో 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో బ్లాక్ బస్టర్ గా నిలిస్తే గం గం గణేశ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా మూడు సినిమాల్లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు బుక్ మై షో లో ఆల్ మోస్ట్ 11 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…

Gam Gam Ganesha Movie 1st Day Total World Wide Collections Report
మొదటి రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది….తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ 1.2 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజున 70 లక్షల రేంజ్ లో ఉండగా గ్రాస్ లెక్క 1.45 కోట్ల దాకా మొదటి రోజున సినిమా సొంతం చేసుకుంది….

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 5.50 కోట్ల దాకా ఉండగా మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.80 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మంచి గ్రోత్ ని చూపించి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here