Home న్యూస్ గుంటూరు కారం బుకింగ్స్ రిపోర్ట్….డే 1 కలెక్షన్స్ ఎంత రావొచ్చు!

గుంటూరు కారం బుకింగ్స్ రిపోర్ట్….డే 1 కలెక్షన్స్ ఎంత రావొచ్చు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie), మహేష్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా….

132 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 133 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 2000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది సినిమా…ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ అన్ని చోట్లా ఓపెన్ అయ్యి ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో రచ్చ లేపగా…

సినిమా హైదరాబాదులోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ మోస్ట్ 10 కోట్ల బుకింగ్స్ ను అందుకోగా నైజాం ప్రీ బుకింగ్స్ 12 కోట్ల దాకా ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో మంచి జోరుని చూపిస్తున్న సినిమా 18 కోట్లకు పైగా బుకింగ్స్ ఉండగా టోటల్ ఇండియా బుకింగ్స్ రేంజ్ 21 కోట్ల మార్క్ ని దాటేసింది.

ఇక ఓవర్సీస్ లో 14 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 35 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ తో రచ్చ చేస్తున్న సినిమా మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోటిలో రిలీజ్ అవుతున్నా కూడా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 32-35 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 42-45 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి అలాగే సినిమాకి వచ్చే టాక్ ను బట్టి కలెక్షన్స్ రేంజ్ అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక మొదటి రోజు సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ తో రచ్చ లేపుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here