Home న్యూస్ 1st డే జాబిలమ్మ నీకు అంత కోపమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

1st డే జాబిలమ్మ నీకు అంత కోపమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్(dhanush) డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా(Jaabilamma Neeku Antha Kopama Movie) రీసెంట్ గా డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవ్వగా తమిళ్ తో పాటు తెలుగు లో రిలీజ్ అయిన సినిమా..

అన్ని చోట్లా డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది కానీ పోటి లో ఉన్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఇంకా బెటర్ గా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఉన్నంతలో జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా పర్వాలేదు అనిపిస్తూ ఓపెన్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు అన్ సీజన్ లో ఓవరాల్ గా ఓకే అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా 40-45 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది….ఇక సినిమా తమిళనాడులో మొదటి రోజు 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా… ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.

కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో సినిమా కి పర్వాలేదు అనిపించే ట్రెండ్ కనిపిస్తూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజున 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, బిజినెస్ లెక్కలు క్లియర్ గా రివీల్ అవ్వాల్సి ఉంది. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here