ధనుష్(dhanush) డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా(Jaabilamma Neeku Antha Kopama Movie) రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా…సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. కామెడీ సినిమాలో డీసెంట్ గా వర్కౌట్ అవ్వగా ఓవరాల్ గా ఆడియన్స్ నుండి…
మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని అయితే ఏమి సినిమా చూపించ లేక పోయింది…తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మొత్తం మీద 55 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 25 లక్షలకు పైగా…
షేర్ ని మొదటిరోజున సొంతం చేసుకోగా బిజినెస్ లెక్కలు ఇంకా క్లియర్ గా తెలియరాలేదు…ఇక తమిళనాడులో సినిమా మొదటి రోజున 1.6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 30 లక్షల లోపు గ్రాస్ ను అందుకోగా….
ఓవర్సీస్ లో సినిమా 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని సమాచారం. దాంతో మొదటి రోజున వరల్డ్ వైడ్ గా సినిమా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుందని అంచనా…షేర్ 1.8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్…
15-16 కోట్ల దాకా ఉంటుందని అంచనా…సినిమా కి టాక్ బాగానే సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఓపెనింగ్స్ ఒకింత అంచనాలను అందుకోలేక పోయాయి. కానీ టాక్ బాగానే ఉండటంతో వీకెండ్ లో సినిమా ఎంతవరకు జోరు ని చూపించగలుగుతుందో చూడాలి.