బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ కంగువ(Kanguva) వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుం రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా మంచి జోరుని చూపెడుతూ దుమ్ము లేపే స్టార్ట్ ను మొదటి రోజు సొంతం చేసుకోబోతుంది…
సూర్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ భీభత్సం సృష్టించబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….నైజామ్ తో పాటు ఆంధ్ర మరియు సీడెడ్ లలో కూడా…
మొదటి రోజు సినిమా టాక్ ఎలా ఉన్నా మాస్ సెంటర్స్ లో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3.5-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు…
అంచనాలను మించిపోతే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….. ఇక తమిళనాడులో లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా మంచి స్టార్ట్ ను అందుకోబోతుండగా, 12-14 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది…
ఇక కర్ణాటక, కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా సినిమా ట్రెండ్ సాలిడ్ గా ఉండటంతో 8-9 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియాలో మొదటి రోజు సినిమా 26-28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే…
30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు, నార్త్ బెల్ట్ జోరుని బట్టి ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఓవర్సీస్ లో సినిమా 1.5 మిలియన్ మార్క్ కి పైగా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా….
40 కోట్ల రేంజ్ నుండి 42 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఈ అంచనాలను కూడా సినిమా మించే ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉంది…సూర్య కెరీర్లోనే ఇవి ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు మరి సినిమా మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఈ అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.