బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాల తర్వాత సాలిడ్ ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందే…
ఓపెన్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి టికెట్ సేల్స్ లో కనిపించలేదు…దాస్ క ధమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా మెకానిక్ రాకీ మాత్రం నిరాశ కలిగించగా ఇప్పుడు లైలా మూవీ అయినా బెటర్ ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా..
పెద్దగా ఓపెనింగ్స్ లో ఇంపాక్ట్ ఏమి కనిపించలేదు…టికెట్ సేల్స్ చాలా నిరాశ కలిగించే విధంగా ఉండగా టాక్ కూడా మిక్సుడ్ గా ఉండటంతో షో షో కి పెద్దగా ఇంప్రూవ్ మెంట్ ఏమి కూడా కనిపించ లేదు…దాంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే…
50-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. రీసెంట్ టైంలో విశ్వక్ సేన్ కెరీర్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తర్వాత ఇదే లో ఓపెనింగ్స్ అని చెప్పాలి ఇప్పుడు…
సినిమా కి టాక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి లేక పోవడంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగానే షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న తర్వాత విశ్వక్ సేన్ కి సాలిడ్ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది ఈ సినిమాతో…