![Pottel Movie 1st Day Box Office Collections Report](https://t2blive.com/wp-content/uploads/2024/10/sye-ryersd.jpg)
చిన్న సినిమానే అయినా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ బజ్ ను సొంతం చేసుకున్న చిన్న సినిమా అయిన పోట్టేల్(Pottel Movie Box Office Collections) ….సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ బాగుండటం, ఎలివేషన్ లు, ఎమోషన్ లు బాగానే వర్కౌట్ అవ్వగా…
క్లైమాక్స్ కూడా మెప్పించడంతో సినిమా ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపిస్తుంది అనుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది ఇప్పుడు…
పట్టుమని 5 వేల టికెట్ సేల్స్ ను కూడా ఆన్ లైన్ లో సొంతం చేసుకోలేక పోయిన సినిమా ఆఫ్ లైన్ లో కూడా బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ అయిన లోకేషన్స్ లో…
ఓవరాల్ గా 25 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ కి అటూ ఇటూగానే కలెక్షన్స్ ని గ్రాస్ రూపంలో సొంతం చేసుకోగా షేర్ పరంగా సినిమా 32 లక్షల లోపే షేర్ ని సొంతం చేసుకుంది..
మంచి ప్రమోషన్స్ ని జరుపుకుని ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ను మొదటి రోజు చూపించలేక పోయింది. ఇక బిజినెస్ పరంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…
3.6-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని అంచనా…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ ఉన్న నేపధ్యంలో వీకెండ్ లో గ్రోత్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…
Naa pingugallu Mee ardham bardham review nayallaki ilantivi ardham avvavu