బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ క్రితం లవ్ స్టోరీ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్(Return Of The Dragon) తెలుగు లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది.
తమిళ్ లో యునానిమస్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన సినిమా తెలుగు లో కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. దాంతో ఓపెనింగ్స్ విషయంలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు వీక్ గా అనిపించినా కూడా ఈవినింగ్ షోల నుండి బుక్ మై షో లో టికెట్ సేల్స్ లో మంచి గ్రోత్ కనిపించగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా సినిమా మంచి జోరునే చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తుంటే సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో…80-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్..
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది, ఇక తమిళనాడులో సినిమా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అవ్వగా ఈవినింగ్ షోలలో కూడా మంచి జోరు కనిపిస్తూ ఉండటంతో ఓవరాల్ గా…
మొదటి రోజు సినిమా అక్కడ 4.5-5కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మంచి జోరు చూపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా 7.5-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక డే 1 ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.