Home న్యూస్ 1st డే స్కంద కలెక్షన్స్….మాస్ సెంటర్స్ లో కుమ్ముంది…కానీ!!

1st డే స్కంద కలెక్షన్స్….మాస్ సెంటర్స్ లో కుమ్ముంది…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రీసెంట్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి మందు రోజు వరకు చూసుకుంటే….

4 కోట్ల కి అటూ ఇటూగానే ఉండగా మౌత్ టాక్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ నే ఎక్కువగా నమ్ముకుని రిలీజ్ అయిన స్కంద సినిమా మాస్ సెంటర్స్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది. క్లాస్ సెంటర్స్ లో మాత్రం బుకింగ్స్ అంతంత మాత్రమే…

ఉండగా మాస్ సెంటర్స్ లో మాత్రం ఓవరాల్ గా బుకింగ్స్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో మంచి జోరు ఉంది. కానీ ఓవరాల్ బుకింగ్స్ ట్రెండ్ మాత్రం రామ్ ప్రీవియస్ మూవీ ది వారియర్ రేంజ్ ఓ అయితే లేవు… కానీ బోయపాటి మూవీస్ కి మాస్ లో మంచి రీచ్ ఉంటుంది కాబట్టి…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని కూడా ట్రాక్ చేయలేం కాబట్టి అన్ని చోట్లా బుకింగ్స్ లో జోరు ఇలానే కొనసాగితే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7-8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే…

ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా 10-11 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని సినిమా మొదటి రోజు అందుకోవచ్చు. మొత్తం మీద సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే ఈ మార్క్ ని అందుకుంటుందా లేక మించిపోతుందా అన్నది ఆడారపడి ఉంది… ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here