Home న్యూస్ 1st డే తండేల్ ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడు యువ సామ్రాట్!!

1st డే తండేల్ ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడు యువ సామ్రాట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో 1700 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజు ఓవరాల్ గా 6.5 కోట్ల రేంజ్ మార్క్ ని దాటగా…

రిలీజ్ రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో దూసుకు పోతూ ఉండగా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. చాలా చోట్ల ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అయిన సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అన్నీ అనుకున్నట్లు జరిగితే నాగ చైతన్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సోలో హీరోగా నమోదు చేసే అవకాశం ఉండగా, ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

6-7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరుని బట్టి కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ప్రీమియర్స్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను..

సొంతం చేసుకున్న సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో కూడా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత కూడా తండేల్ మూవీ తో నాగ చైతన్య ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ…

సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకునేలా కనిపిస్తూ ఉండగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక డే 1 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here