ఆల్ మోస్ట్ మూడేళ్ళ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో కుమ్మేస్తున్నాడు యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో….మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అన్ సీజన్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కి…
బాగానే రప్పిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 7 కోట్లకి చేరువ అయ్యే బుకింగ్స్ ను రిలీజ్ కి ముందు రోజే సొంతం చేసుకోగా ఇక ఓపెనింగ్ డే రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ..
దూసుకు పోతూ ఉండగా సినిమా ఆల్ మోస్ట్ నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనర్ అయిన లవ్ స్టోరీకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఓపెనింగ్స్ తో కుమ్మేస్తుంది. దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను…
తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయిన సినిమా…
ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో హాల్ఫ్ మిలియన్ కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉన్న నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజున నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా..
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి ఈ మార్క్ ని దాటేసి ఎంతవరకు ముందుకు వెల్లగలుగుతుందో చూడాలి. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ తో 2 బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ ను మరిపించేలా కుమ్మేస్తుంది. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.