బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie 1st Day Collections) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా ఓపెనింగ్స్ ఏమాత్రం ఇంప్రెస్ చేసే విధంగా అయితే లేవనే చెప్పాలి…
గోపీచంద్ సినిమాలు అంటే ఎక్కువ శాతం ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల పై డిపెండ్ అయ్యి ఉంటుంది, దానికి తోడు రిలీజ్ రోజు డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ వలన ఆంధ్రలో కొన్ని చోట్ల రిలీజ్ లేట్ అయింది…. ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే మాత్రం మొదటి రోజు పెద్దగా జోరు చూపించడం లేదు అనే చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
మొదటి రోజు అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా…
1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద చూసుకుంటే మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి అంటే సినిమా మినిమమ్ 2.5 కోట్లు ఆ పైన షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు నైట్ షోలకు సాలిడ్ ట్రెండ్ ను చూపెడితే షేర్ అంచనాలను మించి రావొచ్చు కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ అంచనాలను మించుతాయో లేక ఇదే రేంజ్ లో వస్తాయో చూడాలి ఇక…