Home న్యూస్ విశ్వం 1st డే కలెక్షన్స్ రిపోర్ట్….డే 2 బాక్స్ ఆఫీస్ అప్ డేట్!!

విశ్వం 1st డే కలెక్షన్స్ రిపోర్ట్….డే 2 బాక్స్ ఆఫీస్ అప్ డేట్!!

0
Viswam Movie 1st Day Total Collections
Viswam Movie 1st Day Total Collections

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) శ్రీనువైట్ల ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie 1st Day Total Collections) రీసెంట్ గా రిలీజ్ అయ్యి రొటీన్ కమర్షియల్ మూవీ అనిపించే టాక్ ను సొంతం చేసుకోగా ఆంధ్ర ఏరియాలో మార్నింగ్ షోలకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా కూడా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు ఓవరాల్ గా 28 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో గోపీచంద్ ప్రీవియస్ మూవీ అయిన భీమా తో పోల్చితే…

కలెక్షన్స్ తక్కువే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మొదటి రోజు సినిమా కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.15 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా…

2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని ట్రేడ్ అంచనా…సినిమా ఓవరాల్ గా 12 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది, మొదటి రోజు చూపించిన జోరు మీద ఇంకా మాసివ్ గ్రోత్ ని ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉండగా…

ఇక రెండో రోజు దసరా పండగ హాలిడే అడ్వాంటేజ్ తో ఇప్పుడు రెండో రోజు డబుల్ గ్రోత్ ని అయితే చూపిస్తుంది చాలా సెంటర్స్ లో…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ ట్రెండ్ సాలిడ్ గానే ఉండటంతో రెండో రోజు సినిమా మంచి నంబర్స్ ను పోస్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది….

ఓవరాల్ గా రెండో రోజు 1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు అలాగే రేపు మరింత జోరు చూపించే అవకాశం ఉండటంతో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here