Home గాసిప్స్ ఎన్టీఆర్31 కన్నా ముందు సాలార్2…కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది!

ఎన్టీఆర్31 కన్నా ముందు సాలార్2…కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది!

0

ప్రజెంట్ ఇండియన్ డైరెక్టర్స్ లో భారీ లెవల్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఒకరు….రీసెంట్ గా సలార్(Salaar part 1 – ceasefire) తో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) తో NTR31 సినిమా చేయాల్సి ఉంది…

ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినా కూడా RRR డిలే వలన తర్వాత దేవర(Devara Part 1) వలన లేట్ అవుతూ రాగా తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు వార్2(War 2 movie) కూడా కమిట్ అవ్వడంతో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడానికి టైం పడుతూ ఉంది….కాగా రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 సినిమాను పోస్ట్ పోన్ చేసి…

సలార్2(Salaar2 Movie) ను పట్టాలు ఎక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతూ ఉండగా దీని గురించి అసలు నిజాలు ఇవేనని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతుంది….ఆ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్31 కన్నా ముందు సలార్2 మొదలు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది…

కానీ సలార్2 షూటింగ్ పరంగా ముందుగా సలార్ 1 లో చిన్నప్పటి ప్రభాస్(Prabhas) పృద్వీరాజ్(prithviraj sukumaran) ల నటించిన పిల్లలు పెద్ద అవుతూ ఉండటంతో సలార్2 లో వాళ్ళ మీద తీయాల్సిన సన్నివేశాలు ఉండటంతో ముందుగా వాళ్ళ పైన సీన్స్ ని తీసేసి తర్వాత నెమ్మదిగా సలార్2 షూటింగ్ ను మొదలు పెట్టె అవకాశం ఉందని లేటెస్ట్ టాక్…

అందుకోసమే ఎన్టీఆర్31 కన్నా ముందు సలార్2 మొదలు అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు…ఈ షూటింగ్ అయ్యే టైంకి ఎన్టీఆర్ దేవర, వార్2 సినిమాల షూటింగ్ లను పూర్తి చేసి తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమాను మొదలు పెడతాని, ఇంతలో ప్రభాస్ బాలెన్స్ ఉన్న తన అప్ కమింగ్ మూవీస్ రాజాసాబ్, స్పిరిట్ సినిమాలను పూర్తి చేసి తర్వాత సలార్2 లో జాయిన్ అవుతారని సమాచారం….

Salaar 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here