బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన మార్చ్ నెలలో ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, ఫస్ట్ వీక్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల కూడా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ని చూపించిన సినిమా ఫస్ట్ వీక్ లో మాస్ రచ్చ చేసింది. 7వ రోజున కూడా సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా…తెలుగు రాష్ట్రాల్లో మరోసారి అంచనాలను మించింది.
మొత్తం మీద మరోసారి 1 కోటి రేంజ్ లో షేర్ ని దాటేయడం ఖాయం అని అనుకున్నా కూడా సినిమా మరోసారి సాలిడ్ జోరుని చూపించి 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా…
ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 1.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రిమార్కబుల్ జోరుని కొనసాగించి ఫస్ట్ వీక్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody 1st Week(7 Days) WW Collections(Inc GST)
👉Nizam – 7.05CR~
👉Ceeded – 97L~
👉Andhra – 5.55Cr~
AP-TG Total – 13.57CR(22.35CR~ Gross)
👉KA+ROI: 1.50Cr
👉OS- 4.25CR
Total World Wide Collections: 19.32CR(36.60CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి టార్గెట్ మీద ఏకంగా 12.32 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది.