లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసిన మాన్ ఆఫ్ మాసెస్ అయిన ఎన్టీఆర్(Jr NTR) నటించిన రీసెంట్ మూవీ దేవర(Devara) లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ హిట్ గా నిలిచింది. మిక్సుడ్ టాక్ తో ఆల్ మోస్ట్ నెలకు పైగా స్టడీ రన్ ను కొనసాగించిన సినిమా…. 450 కోట్లకు పైగా గ్రాస్ తో…
భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా సినిమాను రీసెంట్ గా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. టీం అక్కడికి వెళ్లి సినిమాను బాగానే ప్రమోట్ కూడా చేశారు. దాంతో ఇక కలెక్షన్స్ పరంగా సినిమా కుమ్మేస్తుంది అనుకోగా మొదటి వీకెండ్ 3 రోజుల్లో సినిమా 7000 వరకు…
టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి జోరునే చూపించగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ స్టడీగానే దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా… 9500 వరకు టికెట్ సేల్స్ ను…
సినిమా సొంతం చేసుకోగా మొదటి వారానికి గాను ఈజీగా 10 వేలకు పైగానే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా జపాన్ కరెన్సీ లో సినిమా అక్కడ 15.5 మిలియన్ జపాన్ యెన్స్ ను వసూల్ చేసినట్లు అంచనా వేస్తున్నారు….
ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఫస్ట్ వీక్ కి గాను సినిమా ఆల్ మోస్ట్ 91 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు అంచనా…అక్కడ రీసెంట్ టైంలో రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ నే దేవర సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.