బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఏ దశలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి…
చూపించ లేక పోయిన మొదటి వారంలో ఎపిక్ డిసాస్టర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. సినిమా మొత్తం మీద 7వ రోజున మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకుంది. దాంతో సినిమా ఫేట్ ఇక కన్ఫాం అవ్వగా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Robin Hood 7 Days WW Collections Report(Inc GST)
👉Nizam: 2.26Cr~
👉Ceeded: 71L~
👉Andhra: 2.26Cr~
AP-TG Total:- 5.23CR(10.00CR~ Gross)
👉KA+ROI: 40L~
👉OS: 80L~
Total WW Collections – 6.43CR(12.82CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వీక్ లో సినిమా ఏమైనా లాస్ ను కవర్ చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.