సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబో లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 550 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ 2.0… 2018 ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ మూవీ గా వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా హిట్ అనిపించు కున్నా బాహుబలి రికార్డులను అందు కోలేదు. కానీ సినిమా యూనిట్ మాత్రం చైనా లో సినిమా భీభత్సం సృష్టిస్తుందని భారీ ఆశలు అప్పుడు పెట్టుకున్నారు.
ఇండియన్ సినిమాల పరంగా అక్కడ మరే సినిమా కూడా రిలీజ్ కాలేని విధంగా ఏకంగా 48 వేల థియేటర్స్ లో సినిమా ను రిలీజ్ చేశారు. సినిమా బిజినెస్ కూడా రికార్డ్ లెవల్ లో జరగగా సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే డాలర్స్ లో అక్షరాలా 25$ మిలియన్ వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది….
అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన రోబో 2.0 వీకెండ్ ముగిసే సరికి అతి కష్టం మీద కేవలం 2 మిలియన్ ని దాటగా 5 రోజుల్లో 2.93 మిలియన్ మార్క్ ని అందుకుంది… ఇక ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి సినిమా అక్కడ 3.09 మిలియన్ మార్క్ ని మాత్రమె వసూల్ చేసి పరుగును ముగించింది.
ఇండియన్ కరెన్సీ లో టోటల్ గ్రాస్ సుమారు 24 కోట్ల దాకా ఉంటుందని అంచనా… డాలర్స్ లో మొత్తంగా 25$ మిలియన్ టార్గెట్ లో కేవలం 3 మిలియన్ రికవరీ అవ్వగా ఏకంగా 22 మిలియన్ వరకు లాస్ ని సొంతం చేసుకుని అక్కడ ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైం…
బిగ్గెస్ట్ డిసాస్టర్ గా మిగిలి పోయింది ఈ సినిమా.. అక్కడ కలెక్షన్స్ పై భారీ ఆశలు పెట్టుకున్న సినిమా కు థియేటర్ రెంట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులకు సరిపడా కలెక్షన్స్ కూడా సినిమా ఇవ్వలేక పోయింది. దాంతో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా అక్కడ నిలిచిపోయింది ఈ సినిమా.. బాహుబలి సినిమా అయినా 85-100 కోట్ల గ్రాస్ ని అక్కడ వసూల్ చేసింది.