నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ పై ఆడియన్స్ లో క్రేజ్ రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తీ అయినా కానీ అస్సలు తగ్గలేదు. డిజిటల్ లో చూసే వాళ్ళు అక్కడ సినిమాను చూస్తూ ఉంటే మరోసారి థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడ మరోసారి వెళ్లి సినిమా ని చూడటానికి ఇష్టపడుతూ ఉన్నారని చెప్పాలి. దాంతో అక్కడ వ్యూవర్ షిప్ ఇటు కలెక్షన్స్ ని…
సినిమా ఇప్పటికీ సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ కన్నా ముందే ఇతర ఇండస్ట్రీ లలో కూడా సినిమా పై మంచి బజ్ ఏర్పడగా డిజిటల్ రిలీజ్ తర్వాత సబ్ టైటిల్స్ లో చూసిన తర్వాత ఈ సినిమా హిందీ లో డబ్ చేసి రిలీజ్ చేసినా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందీ అంటూ అందరూ సినిమా ను హిందీ లో డబ్ చేయండి అంటూ అడుగుతూ ఉండగా మరో పక్క సినిమా కి హిందీలో కూడా రీమేక్ రైట్స్ కోసం పోటి మొదలు అయిందని అంటున్నారు ఇప్పుడు…
నార్త్ సైడ్ ఇలాంటి హిందూ యిజాన్ని హైలెట్ చేసే సీన్స్ కానీ, దేవాలయాలు దేవుళ్ళని గొప్పగా చూపించే సీన్స్ కానీ…. హీరోలను మాస్ గాడ్స్ గా చూపించే సన్నివేశాలను విరగబడి చూస్తారు. ఇలాంటివి అన్నీ అఖండలో ఉండటంతో కొందరు డబ్ చేసి రిలీజ్ చేయమంటూ చెబుతూ ఉండగా మరో పక్క ఇండస్ట్రీ వాళ్ళు సినిమా రీమేక్ హక్కుల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది…
రేసులో అజయ్ దేవగన్ మరియు అక్షయ్ కుమార్ లు ముందు వరుసలో ఉన్నారని, బాలయ్య అఖండ రోల్ కి వీళ్ళు మాత్రమే న్యాయం చేయగలరని ఈ ఇద్దరు హీరోల తరుపున నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే రీమేక్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. కానీ అక్కడ ఆడియన్స్ రీమేక్ కన్నా డబ్ చేస్తే బాగుంటుంది అంటున్నారట. మరి మేకర్స్ రీమేక్ ని ప్రిఫెర్ చేస్తారా లేక డబ్ కి ట్రై చేస్తారో చూడాలి…