బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ 19 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో కొంచం క్రేజ్ ఉన్న సినిమా చావు కబురు చల్లగా… కార్తికేయ ఫ్లాఫ్స్ లో ఉన్నా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా అంటే హిట్ అవ్వాల్సిందే అన్న టాక్ ఉండగా ఆ ట్రాక్ రికార్డ్ ను మిస్ చేస్తూ ఈ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుని రిలీజ్ అవ్వగా, తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఎలాగోలా…
పర్వాలేదు బాగా వచ్చాయి అనిపించే లెవల్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ గట్టిగానే సొంతం చేసుకుంది, కానీ మళ్ళీ పుంజుకుని మినిమమ్ కోటి రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు లే అనుకున్నా కానీ…
మొదటి రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 70% డ్రాప్స్ ని కలెక్షన్స్ రూపంలో సొంతం చేసుకుని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది, రెండో రోజు కేవలం 44 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 47 లక్షల షేర్ ని మాత్ర్రమే సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 79L
👉Ceeded: 36L
👉UA: 24L
👉East: 15L
👉West: 9L
👉Guntur: 14L
👉Krishna: 16L
👉Nellore: 9L
AP-TG Total:- 2.02CR (3.22Cr Gross~)
Ka+ROI: 6L
OS – 6L
Total WW: 2.14CR( 3.48Cr Gross~)
ఇదీ సినిమా పరిస్థితి. సినిమాను టోటల్ గా 13 కోట్లకు అమ్మగా సినిమా 13.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 11.36 కోట్ల దూరంలో ఉంది, ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.