యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా హిందీ లో కూడా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది కానీ ప్రభాస్ బాహుబలి అండ్ సాహో లతో పోల్చితే కలెక్షన్స్ అంచనాలను అందుకోలేక పోయాయి. సినిమాను అక్కడ 50 కోట్ల వర్త్ బిజినెస్ సొంతం అవ్వగా 110 కోట్ల రేంజ్ లో…
నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా మొదటి రోజు 4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రెండో రోజు మరోసారి 4.5 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకుని, 2 రోజుల్లో టోటల్ గా 9 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 12.4 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
టోటల్ గా 4.45 కోట్ల దాకా షేర్ ని సాధించింది…. 110 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 101 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది… ఏదైనా అద్బుతం జరిగితే తప్ప హిందీ లో ఈ మార్క్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు ఇప్పుడు…. డిసాస్టర్ టాక్ తో సాహో దుమ్ము లేపినా క్లాస్ మూవీ అయిన రాధే శ్యామ్ మాత్రం కష్టపడక తప్పేలా లేదు…