బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలలో అంటే మాస్ మూవీస్ ని ఇష్టంగా చూస్తారు కాబట్టి కలెక్షన్స్ సాలిడ్ గా వస్తున్నాయని చెప్పొచ్చు కానీ ఓవర్సీస్ లో కూడా అఖండ లాంటి ఫక్తు మాస్ మూవీ కి అల్టిమేట్ కలెక్షన్స్ రావడం అంటే మట్టుకు…
మెంటల్ మాస్ రికార్డ్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య అండ్ బోయపాటి ఇద్దరూ కూడా రీసెంట్ టైం లో ఫ్లాఫ్స్ లోనే ఉండటం, బోయపాటి సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు కాబట్టి ఆ ఇంపాక్ట్ వలన అఖండ సినిమాను ఓవర్సీస్ లో మరీ భారీ రేట్లకి ఏమి అమ్మలేదు…
మొత్తం మీద సినిమాను ఓవర్సీస్ మొత్తం మీద 2.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా ప్రీమియర్స్ నుండే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుని దుమ్ము లేపగా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో సినిమా అక్కడ 2.35 కోట్ల షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
ఇక రెండో రోజు మొత్తం మీద సినిమా అక్కడ ఆల్ మోస్ట్ 1.1 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటేసి 550K మార్క్ ని అధిగమించిన సినిమా టోటల్ గా ఓవర్సీస్ లో 2 రోజుల్లోనే ఇప్పుడు 3.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ ను అక్కడ దాటేసి ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అయ్యింది ఇప్పుడు.
దాంతో ఓవరాల్ గా అఖండ సినిమా బిజినెస్ పరంగా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న ఏరియాగా ఓవర్సీస్ నిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యపరుస్తుంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో ఇలాంటి మాస్ మూవీ కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం, కలెక్షన్స్ పరంగా సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం. సినిమా జోరు ఇలానే కొనసాగితే త్వరలోనే 1 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఇప్పుడు.