శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్స్ రజినీకాంత్ మరియు అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న మెగా మమ్మోత్ మూవీ రోబో 2.0 రిలీజ్ కి రెండు రోజుల సమయమే ఉంది. సినిమా అన్ని ఏరియాలలో అల్టిమేట్ బిజినెస్ ని సాధించగా రెండు తెలుగు రాష్ట్రాలలో డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ బిజినెస్ ని సాధించి చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుంది.
సినిమా నైజాం ఏరియా కి గాను ఏకంగా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది, ఇక సీడెడ్ ఏరియాలో ఏకంగా 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ ఆంధ్రా లో రోబో 2.0 సినిమా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది.
దాంతో సినిమా టోటల్ గా రెండు రాష్ట్రాలలో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 71 కోట్ల మార్క్ ని దాటింది. దాంతో ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇక్కడ మినిమమ్ 72 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాలలో సాధించాల్సి ఉంటుంది. ఎలాంటి పోటి లేకుండా రిలీజ్ అవుతుండటం తో పాజిటివ్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ ని సాధించడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి.