బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు ఇప్పుడు రెండు వారాలను పూర్తీ చేసుకుంది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని పండగ సెలవుల అడ్వాంటేజ్ తో సొంతం చేసుకుంది కానీ రెండో వారంలో కలెక్షన్స్ పరంగా సినిమా బాగా స్లో డౌన్ అయింది అని చెప్పాలి. 3rd వేవ్ ఇంపాక్ట్ కూడా గట్టిగానే…
ఇబ్బంది పెట్టింది అన్నది అందరికీ తెలిసిన విషయమే, కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 30.48 కోట్లు వసూల్ చేస్తే రెండో వారంలో 3.3 కోట్లు మాత్రమే వసూల్ చేయగా…
వరల్డ్ వైడ్ గా 33.45 కోట్లు వసూల్ చేస్తే రెండో వారంలో కేవలం 3.53 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. ఇక 14 వ రోజున ఆల్ మోస్ట్ 50% డ్రాప్ అయిన సినిమా 26 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 8.14Cr
👉Ceeded: 6.59Cr
👉UA: 5.01Cr
👉East: 4.00Cr
👉West: 2.81Cr
👉Guntur: 3.35Cr
👉Krishna: 2.18Cr
👉Nellore: 1.70Cr
AP-TG Total:- 33.78CR(54.80Cr~ Gross)
👉Ka+ROI: 1.74Cr
👉OS – 1.46Cr
Total WW: 36.98CR(62.10CR~ Gross)
ఇదీ సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కలెక్షన్స్ లెక్క. సినిమా టోటల్ బిజినెస్ 38.15 కోట్లు కాగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు పూర్తీ చేసుకున్న తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.02 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. మూడో వారంలో కూడా సినిమా కి మంచి థియేటర్స్ హోల్డ్ ఉండగా సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని ఈ వారంలో సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.