సుధీర్ బాబు ఆనంది ల కాంబినేషన్ లో పలాసా డైరెక్టర్ తో కలిసి చేసిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్… బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా పై మంచి బజ్ నెలకొనగా సినిమాకి బిజినెస్ కూడా బాగానే జరిగింది, సినిమా కి డీసెంట్ టాక్ కూడా ఆడియన్స్ నుండి లభించింది కానీ వీకెండ్ కలెక్షన్స్ పరంగా జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ సినిమా…
తర్వాత వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసింది, కానీ సెకెండ్ వీకెండ్ ఆదివారం మంచి వసూళ్లు కొత్త సినిమాలు ఏవి బాలేక పోవడం తో సొంతం చేసుకున్న ఈ సినిమా మళ్ళీ వర్కింగ్ డేస్ లో డౌన్ అయింది… 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 4.63 కోట్ల షేర్ ని అందుకున్న…
శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మిగిలిన మూడు రోజుల వర్కింగ్ డేస్ లో మరో 18 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది… దాంతో తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండు వారాల్లో 4.81 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 5.2 కోట్ల మార్క్ ని దాటింది…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 2 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.61Cr
👉Ceeded: 83L
👉UA: 73L
👉East: 45L
👉West: 26L
👉Guntur: 48L
👉Krishna: 28L
👉Nellore: 17L
AP-TG Total:- 4.81CR(8.15Cr Gross)
KA+ROI: 13L
OS: 28L~
Total Collections: 5.22CR(9.05CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 8 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 2 వారాల్లో 3.28 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…రెండో వారం మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కోటి రేంజ్ లో షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది.. మూడో వారం చాలా థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా ఇక నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును ముగించడం ఖాయం..