Home గాసిప్స్ 4 భాషల్లో రీమేక్ అయిన 100 కోట్ల బ్లాక్ బస్టర్…2 ఏళ్ళుగా అసలు ఊసే లేదు!!

4 భాషల్లో రీమేక్ అయిన 100 కోట్ల బ్లాక్ బస్టర్…2 ఏళ్ళుగా అసలు ఊసే లేదు!!

0

ఏదైనా ఒక భాషలో హిట్ అయిన సినిమా అంటే ఇతర భాషల్లో రీమేక్ కి ఎగబడటం కామన్, ఆ సినిమా ను రీమేక్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు, అలా ప్లాన్ చేసిన అన్ని సినిమాలు సక్సెస్ కావు కానీ అంచనాలను పెంచిన సినిమాల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఉంది. ఆ సినిమానే కంగనా రనౌత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ క్వీన్… అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర…

సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఏకంగా ఇండియాలో 61 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా…అది కూడా 2014 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో రచ్చ చేసింది.

అలాంటి ఈ సినిమాను ఆ టైం లోనే రీమేక్ రైట్స్ ని సౌత్ లో అన్ని భాషల్లో సొంతం చేసుకుని నిర్మించాలని చూశారు, కాస్ట్ అండ్ క్రూ ని సెట్ చేయడానికి టైం పట్టగా మూడేళ్ళ క్రితం కాజల్, తమన్నా, మంజిమా మోహనన్ లాంటి హీరోయిన్స్ తో తెలుగు, తమిళ్, మలయాళం మరియు…

కన్నడలో ఏ భాష కా భాషలోనే రీమేక్ లను మొదలు పెట్టారు, 2019 ఎండ్ టైం కే సినిమాలు అన్నీ రిలీజ్ కి రెడీ కూడా అయ్యాయి. కానీ అప్పటి నుండి సినిమాల రిలీజ్ పై ఎలాంటి న్యూస్ లేదు. కనీసం బజ్ కూడా లేదు. ఆల్ మోస్ట్ అన్ని భాషల్లో రీమేక్ ల ఖర్చు అంచనాలను దాటిపోయిందట. అయినా కూడా సినిమాల రిలీజ్ డేట్స్ పై ఎలాంటి న్యూస్ లేకుండా పోయింది ఇప్పటి వరకు…

OTT లో డైరెక్ట్ రిలీజ్ చేస్తారు అన్న టాక్ వచ్చినా కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు… ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలన సినిమా రిలీజ్ కి నోచుకోవడం లేదని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. మరీ లేట్ చేయడం తో బజ్ మొత్తం పోయి సినిమా రిజల్ట్ పైనే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.ఎలాగోలా ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయించాలని ట్రై చేస్తున్నారట, మరి ఈ సారి అయినా సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here