Home న్యూస్ ఇండియన్ సినిమా ఎపిక్ క్లాష్ కి 20 ఏళ్ళు!

ఇండియన్ సినిమా ఎపిక్ క్లాష్ కి 20 ఏళ్ళు!

0

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాల మధ్య పోటిచరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో నిలిచాయి అని చెప్పాలి. ఒకే రోజు రెండు క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ పరిస్థితి క్లాష్ వల్ల ఇబ్బంది పడ్డ సందర్బాలు ఎక్కువగా ఉంటాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 20 ఏళ్ల క్రితం 2 క్రేజీ సినిమాలు పోటి పడగా ఒక సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది మరో సినిమా…

ఎపిక్ టేకింగ్ అండ్ కంటెంట్ తో ఇండియా పేరు మరింత పెరిగేలా చేసింది. ఆ రెండు సినిమాలే అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమా మరియు సన్నీ డియోల్ నటించిన గదర్ ఏక్ ప్రీమ్ కథ సినిమాలు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జూన్ 15 న బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఈ రెండు సినిమాలు క్లాష్ అయ్యాయి. ముందు క్లాష్ వద్దనే అనుకున్నా మంచి రిలీజ్ టైం అవ్వడం తో ఏ సినిమా కూడా వెనక్కి తగ్గలేదు. లగాన్ సినిమా 3 గంటల 40 నిమిషాల లెంత్ ఉన్నా థియేటర్స్ అన్నీ స్టేడియాలుగా మారిపోయి లెంత్ ని పట్టించుకోకుండా సినిమాను అద్బుతమైన విజయాన్ని అందించారు.

అదే టైం లో విపరీతమైన హైప్ తో వచ్చిన గదర్ ఏక్ ప్రీమ్ కథ ఆ హైప్ ని మించే రేంజ్ కంటెంట్ ఉండటం తో జనాలు బస్సులలో, బండ్లు కట్టుకుని ఎక్కడ ఆ సినిమా ఆడితే అక్కడికి పోయి మరీ చూసే వాళ్ళు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీ గా సంచలనం సృష్టించింది ఆ సినిమా…

లగాన్ సినిమా కంటెంట్ పరంగా అద్బుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా గదర్ రేంజ్ కలెక్షన్స్ ని సాధించలేక పోయింది, కానీ ఇండియా నుండి అఫీషియల్ ఆస్కార్ నామినేషన్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. అనేక ఇంటర్నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది… ఇలా చరిత్రలో ఎపిక్ క్లాష్ ను సొంతం చేసుకున్న ఈ రెండు సినిమాలు 20 ఏళ్లని పూర్తీ చేసుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here