Home న్యూస్ 200 రోజులు….అక్షరాలా 1500 కోట్లు….సామి పర్వతం!!

200 రోజులు….అక్షరాలా 1500 కోట్లు….సామి పర్వతం!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోలలో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అన్ని ఇండస్ట్రీలలో కూడా మంచి మార్కెట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా 11 రోజుల్లో సినిమా 840 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా 12వ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా….సౌత్ హీరోల పరంగా సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు…

ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ సలార్(Salaar Movie) లాస్ట్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయ్యి టోటల్ రన్ లో 630 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని రచ్చ చేసింది. రాంగ్ టైం రిలీజ్ అండ్ క్లాష్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినా కూడా సలార్ మంచి జోరుని చూపించింది…

ఇక ఆ సినిమా వచ్చిన 200 రోజుల గ్యాప్ లో ఇప్పుడు కల్కి మూవీ సాధించిన రీసెంట్ కలెక్షన్స్ తో టోటల్ గా కలిపి 1470 కోట్ల మార్క్ ని దాటేసి 1500 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించబోతుంది…ఈ రేంజ్ లో మరే సౌత్ హీరో నటించిన సినిమాలు తక్కువ గ్యాప్ లో…మాస్ రచ్చ చేయలేదు…

మొత్తం మీద 200 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1500 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో రెబల్ స్టార్ మాస్ ఊచకోత కోశాడు అని చెప్పాలి. ఇక ఆదిపురుష్(Adipurush) ని కూడా ఈ లిస్టులో కలిపితే ఏడాదికి అటూ ఇటూగా గ్యాప్ లో సౌత్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో. లెక్క ఇంకా పెరుగుతుంది…ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here