Home న్యూస్ 2014-2019 బ్లాక్ బస్టర్లు….2020 మాత్రం జై కరోనా!!

2014-2019 బ్లాక్ బస్టర్లు….2020 మాత్రం జై కరోనా!!

0

టాలీవుడ్ కి ప్రతీ ఇయర్ లో కొన్ని సీజన్స్ ఎప్పుడూ కలిసి వస్తూ ఉంటాయి, వాటిలో సంక్రాంతి సీజన్, సమ్మర్ తర్వాత దసరా సీజన్ లు బెస్ట్ గా నిలుస్తాయి. మొదటి రెండు సీజన్స్ తో పోల్చితే దసరా సీజన్ స్టార్ట్ సాలిడ్ గా దక్కినా మిగిలిన రెండు సీజన్స్ లా లాంగ్ రన్ ఉండదు. ఈ మూడు సీజన్స్ తో పాటు రీసెంట్ ఇయర్స్ లో ఒక నెల కూడా….

West All Time Top 10 Share Movies

టాలీవుడ్ కి సాలిడ్ గా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఆ నెల నే జులై నెల… టాలీవుడ్ కి గత 6 ఏళ్లలో జులై నెలలో ప్రతీ సారి ఎదో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రావడం పరిపాటి గా మారింది. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా ఎఫెక్ట్ వలన సినిమాలు లేక…

Krishna Area All Time Top 10 Share Movies

జులై నెల బోసి పోయింది. థియేటర్స్ మూసేసి ఉండటం తో ఈ ఏడాది జులై నెల కరోనా తో ముగిసి పోయింది. ఈ టైం లో ఒకసారి గత 6 ఏళ్ల లో జులై నెలలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…

2014- దృశ్యం:
విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ దృశ్యం కి తెలుగు రీమేక్, తెలుగు లో ఓన్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వెంకీ కి కంబ్యాక్ మూవీ గానే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

2015- బాహుబలి:
పరిచయం అవసరం లేని పేరు… బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవల్ లో ఊచకోత కోసిన ఈ సినిమా టోటల్ గా 118 కోట్ల బిజినెస్ కి 304 కోట్ల షేర్ ని అందుకుని చరిత్ర తిరగరాసే హిట్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

2016 – పెళ్లి చూపులు:
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే జనాలు లేకున్నా కానీ మౌత్ టాక్ తో లాంగ్ రన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా. ఓన్ రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 16 కోట్లకి అటూ ఇటూ గా కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

2017 – ఫిదా:
బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ కి దక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిదా… సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన ఈ సినిమా లాంగ్ రన్ లో 48.5 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసి ఊహకందని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి దుమ్ము లేపింది.

2018 – RX100:
అడల్ట్ కంటెంట్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. సినిమా బిజినెస్ 2 కోట్లకు పైగా ఉండగా సినిమా ఫైనల్ రన్ లో ఆల్ మోస్ట్ 13 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది.

2019 – ఇస్మార్ట్ శంకర్:
రామ్ కెరీర్ లో ఓ ఊరమాస్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుండగా ఫాం లో లేని పూరి తో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఊరమాస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 18 కోట్లకు పైగా బిజినెస్ కి 40.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుని రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

2020- కరోనా:
అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై నెలలో నాగ చైతన్య లవ్ స్టొరీ ముందుగా రిలీజ్ కన్ఫాం చేసుకుంది, కానీ కరోనా వలన పరిస్థితులు పూర్తిగా తలకిందలు అవ్వగా ఈ ఏడాది ఇక భారీ హిట్స్ వచ్చే సూచనలు తక్కువగానే ఉన్నాయి. వచ్చే ఏడాది పరిస్థితులు అన్నీ సద్దుకోవాలని అందరం కోరుకోవడం ఒక్కటే మిగిలింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here