Home న్యూస్ సంక్రాంతి సినిమాల థియేటర్స్ గొడవ…ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఉండొచ్చంటే!!

సంక్రాంతి సినిమాల థియేటర్స్ గొడవ…ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఉండొచ్చంటే!!

0

2021 సంక్రాంతి సీజన్ లో సినిమాలు ఉంటాయా ఉండగా అన్న డౌట్ కొంత టైం క్రితం ఉండేది కానీ సంక్రాంతి రేసులో సినిమాలు నిలుస్తూ రావడం ఒకటికి మించి ఒకటి పోటి లో దిగుతూ ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర పోరు మరింత రసవత్తరంగా మారగా ప్రతీ సంక్రాంతి కి ఉన్నట్లుగానే థియేటర్స్ గొడవ ఈ సారి కూడా ఎక్కువగానే ఉంది.. ప్రతీ సారి తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చి…

Krack First Day Total Worldwide Collections

డబ్బింగ్ మూవీస్ కి తక్కువ థియేటర్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సారి మాత్రం డబ్బింగ్ మూవీ కి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారు దాంతో గొడవ పెరగగా… దీనిపై టాలీవుడ్ సినీ లవర్స్ సోషల్ మీడియాలో గొడవ పెడుతున్నారు. కానీ ఇలా ఇవ్వడానికి ఈ సారి కారణం ఉంది…

లాస్ట్ ఇయర్ సమ్మర్ నుండి వార్తల్లో నిలుస్తున్న సినిమా మాస్టర్…అప్పటికి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటి అవ్వడం క్రేజ్ ఎక్కువ ఉండటంతో రిలీజ్ రోజున ఎక్కువ థియేటర్స్ ని ఇక్కడ క్రేజ్ దృశ్యా ఇవ్వనున్నారు. దాంతో పాటు క్రాక్ రిలీజ్ అయిన తర్వాత మూడు రోజుల గ్యాప్ లో వస్తున్న సినిమా కూడా అవ్వడంతో ఎక్కువ థియేటర్స్ ఈ సినిమా కి దక్కనున్నాయి.

కానీ రెండో రోజుకి సినిమా థియేటర్స్ చాలా వరకు తగ్గనుండగా 2 సినిమాలు రిలీజ్ కానుండటంతో ఆ సినిమాల కోసం థియేటర్స్ కేటాయించనున్నారు. తర్వాత 4 సినిమాల పోటి లో ఆయా సినిమాల టాక్ ని బట్టి ఆడియన్స్ లో క్రేజ్ ని బట్టి థియేటర్స్ ని ఇస్తారని సమాచారం. మొత్తం మీద జనవరి 14/15 టైం కల్లా తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ కౌంట్ ఈ సినిమాలకు ఎంత ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా…

ఇండస్ట్రీ టాక్ ప్రకారం క్రాక్ కి 450 వరకు థియేటర్స్, మాస్టర్ కి 350 థియేటర్స్, రెడ్ మూవీ కి 350 థియేటర్స్… అల్లుడు అదుర్స్ కి 320 థియేటర్స్ కేటాయించనున్నట్లు సమాచారం. సినిమాల క్రేజ్ ని బట్టి ఈ లెక్క కొంచం అటూ ఇటూ అవ్వొచ్చని అంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాలు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయి అన్న దానిపై ఈ లెక్క డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here