ఈ ఇయర్ సెకెండ్ వేవ్ రాకా ముందు వరకు కూడా వరుస పెట్టి సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి, తర్వాత టెలివిజన్ లో కూడా మెప్పించాయి, కానీ సెకెండ్ వేవ్ వలన పరిస్థితులు అన్నీ మొదటికి వచ్చి సినిమాల రిలీజ్ లు ఆగిపోగా సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన అనేక సినిమాలు కొత్త డేట్స్ కోసం చూస్తూ ఉండగా ఆడియన్స్ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తూ టెలివిజన్ లో ఈ ఇయర్…
వచ్చిన సినిమాల టెలికాస్ట్ లతో సరిపెట్టుకుంటున్నారు. ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల పరంగా జులై ఎండ్ అయ్యే టైం కి రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి రేటింగ్ లను సాధించాయి. వాటిలో 8 వ ప్లేస్ లో బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమా 6.92 రేటింగ్ ను అందుకుంది.
ఇక 7 వ ప్లేస్ కి వస్తే నితిన్ నటించిన రంగ్ దే సినిమా 7.22 రేటింగ్ ను సాధించింది, ఇక 6 వ ప్లేస్ కి వస్తే అల్లరి నరేష్ కంబ్యాక్ మూవీ నాంది 7.51 రేటింగ్ ను సొంతం చేసుకోగా, 5 వ ప్లేస్ కి వస్తే జాంబి రెడ్డి సినిమా 8.1 రేటింగ్ ని సాధించింది.
ఇక 4 వ ప్లేస్ కి వస్తే నితిన్ నటించిన చెక్ మూవీ 8.53 రేటింగ్ ను సొంతం చేసుకోగా 3 వ ప్లేస్ లో రవితేజ కంబ్యాక్ మూవీ క్రాక్ సినిమా 11.71 రేటింగ్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక రెండో ప్లేస్ లో సెన్సేషనల్ హిట్ మూవీ ఉప్పెన సినిమా 18.51 రేటింగ్ తో అల్టిమేట్ రికార్డ్ ను బుల్లితెరపై కూడా సొంతం చేసుకుని దంచికొట్టగా…
టాప్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ సినిమా 19.12 రేటింగ్ ను సొంతం చేసుకుని ఈ ఇయర్ జులై వరకు టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన మూవీస్ పరంగా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇయర్ ఎండ్ అయ్యే టైం కి మరిన్ని సినిమాలు ఈ లిస్టు లో చోటు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి టాప్ ప్లేస్ ని అందుకునే సినిమా ఏదైనా వస్తుందా చూడాలి ఇక.