బాక్స్ ఆఫీస్ దగ్గర 2022 ఇయర్ లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలానే ఉండగా అందులో స్టార్స్ నటించిన సినిమాలు కూడా ఉన్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ తో పాటు లాభాలను అందుకున్న సినిమాలు కొన్నే ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఎపిక్ హిట్ అయినా కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా దుమ్ము లేపినా కానీ బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఇప్పటి వరకు 2 ఉన్నాయి.
ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ నటించిన క్రేజీ మూవీ డిజే టిల్లు సినిమా 8.95 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 17.25 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ మోస్ట్ 8.30 కోట్ల లాభంతో టాలీవుడ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గా నిలిచి దుమ్ము దుమారం చేసింది…
ఇక మిగిలిన సినిమాలు ఏవి కూడా ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ ని అందుకోలేదు.. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన కమల్ హాసన్ విక్రమ్ మూవీ 7 కోట్ల బిజినెస్ మీద ఇప్పటి వరకు 16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఆల్ మోస్ట్ 9 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఈ 2 సినిమాలు బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాలుగా నిలిచాయి. మేజర్ కూడా టోటల్ రన్ లో ఈ ఫీట్ ని అందుకునే అవకాశం ఉంది…. ఇక ఇయర్ ఎండ్ అయ్యే వరకు మిగిలిన సినిమాల్లో ఏ సినిమాలు ఈ డబుల్ ప్రాఫిట్స్ ను అందుకుంటాయో చూడాలి.