బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతి తర్వాత మళ్ళీ దసరాకి భారీ పోటి ఏర్పడింది…2 స్ట్రైట్ బిగ్ మూవీస్ తో ఒక భారీ హైప్ ఉన్న డబ్ మూవీ పోటి పడబోతుండగా ఈ మూడు సినిమాలు వేటికవే డిఫెరెంట్ జానర్ లో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి…
నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మరియు కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(Leo Movie) లు 19న రిలీజ్ కానుండగా…
20న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రిలీజ్ కానుండగా ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ సొంతం అవుతాయి అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు…. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం…
అటూ ఇటూగా 1550 వరకు థియేటర్స్ ఉండగా ఈ థియేటర్స్ లో ఆల్ మోస్ట్ 900 కి అటూ ఇటూగా థియేటర్స్ లో భగవంత్ కేసరి రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా లియో మూవీ కి 500 నుండి ఆ పైన థియేటర్స్ దక్కవచ్చు…
ఇక రెండో రోజుకి వచ్చే సరికి టైగర్ నాగేశ్వరరావుకి 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా మిగిలిన థియేటర్స్ లో 60% థియేటర్స్ లో భగవంత్ కేసరి 40% థియేటర్స్ లియో సినిమాకి ఇచ్చే అవకాశం ఉంది. సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి దసరా టైంలో ఫైనల్ లెక్కలు తేలుతాయి.
సంక్రాంతి సీజన్ తో పోల్చితే దసరా సీజన్ అంత పవర్ ఫుల్ ఏమి కాదు కానీ పండగ రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఏ సినిమాకి అయినా టాక్ చాలా ముఖ్యమని చెప్పొచ్చు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఈ దసరా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.